Thursday, September 23, 2021

డిగ్రీ, డిప్లొమా పాసైన వారికి 535 ఉద్యోగాలు.. రూ.1,05,000 జీతం.. పూర్తి వివరాలివే

 

IOCL 513 Jobs: ఇందులో జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి.


భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) రిఫైనరీస్‌ విభాగం.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా
513 పోస్టులను భర్తీ చేయనుంది. 


ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్‌ 12 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 513
  • పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి.
  • విభాగాలు: ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ.
  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
  • వయసు: 30.09.2021 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
  • వేతనం: రూ.1,05,000
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: రూ.150
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్‌ 21, 2021
  • దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 12, 2021
  • రాత పరీక్ష తేది: అక్టోబర్‌ 24, 2021
  • వెబ్‌సైట్‌:https://iocl.com/

Tuesday, September 21, 2021

CDAC Hyderabad Jobs | Notification for Project Manager, Project Engineer and Project Associates 38 Vacancies

 

సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (C-DAC) హైద‌రాబాద్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 38 ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, ప్రాజెక్టు ఇంజనీర్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టును భ‌ర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. అర్హత, ఆసక్తి ఉండి ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొనే అభ్య‌ర్థులు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయాలి.


మొత్తం ఖాళీలు: 38
  • ప్రాజెక్టు
    మేనేజర్- 01
  • ప్రాజెక్టు ఇంజనీర్- 36
  • ప్రాజెక్టు అసోసియేట్- 01
ముఖ్య సమాచారం:
  • అర్హత: సంబంధిత రంగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.
  • దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 17, 2021
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్‌ 5, 2021
  • అధికారిక వెబ్ సైట్:https://www.cdac.in/
  • ఎంపిక విధానం: అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మ‌ల్టీ లెవ‌ల్ ఇంట‌ర్వ్యూ విధానం నిర్వ‌హిస్తారు. అవసరం అయితే ఎంపిక ప్ర‌క్రియ మార్చే హ‌క్కు సంస్థ‌కు ఉంటుంది.

ఇలా అప్లయ్ చేసుకోవాలి:
  • ముందుగా పూర్తి వివరాలకు నోటిఫికేషన్‌ చూడాలి.
  • డిస్‌ప్లేలో ప్ర‌తీ పోస్టు వివ‌రాలు ఉంటాయి.
  • ప్ర‌తీ పోస్టు ప‌క్క‌న Details ఆప్ష‌న్ ఉంటుంది.
  • అది క్లిక్ చేసిన అనంత‌రం పోస్టుకు సంబంధించిన వివ‌రాలు వ‌స్తాయి.
  • అర్హ‌త‌లు స‌రిచూసుకొని కింద Apply ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
  • పూర్తి వివరాలను ఎంటర్‌ చేసిన అనంతరం సబ్‌మిట్‌ చేయాలి.