- బిగ్ బాస్ 5 షో జోరు
- కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్
- రూమర్లపై షణ్ముఖ్ జశ్వంత్
బిగ్ బాస్ షో ఇప్పుడు ఎంతగా హాట్ టాపిక్ మారిందో అందరికీ తెలిసిందే. ఐదో సీజన్‌కు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన లీకులు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తోంది. కంటెస్టెంట్ల లీకుల లిస్ట్ చూస్తే ఈ సారి షో మంచి ఊపు మీదుండేలా కనిపిస్తోంది. కానీ ఆ లిస్ట్‌లోంచి చివరి వరకు ఉండేది ఎవరు? బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేది ఎవరు? అన్న విషయాలే ఆసక్తికరంగా మారాయి. ఆగస్ట్ మొదటి వారంలో వదిలిన బిగ్ బాస్ ఐదో సీజన్ లోగో అందరినీ ఆకట్టుకుంది.
ఈ సారి షో కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతోన్నట్టు పరోక్షంగా చెప్పేశారు. యాంకర్ రవి, నవ్యస్వామి, వర్షిణి, సిరి హన్మంత్, లోబో, యూట్యూబర్ సరయు, షణ్ముక్ జశ్వంత్, సీరియల్ హీరో శ్రీహాన్, ఆట సందీప్ భార్య జ్యోతి, సీరియల్ హీరో మానస్, ప్రియాంక రామన్, నటి ప్రియ, ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ సాయి (ప్రియాంక సింగ్), యానీ మాస్టర్, టీవీ 9 ప్రత్యూష ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. సురేఖా వాణి, ఇషా చావ్లా పేర్లు కూడా వినిపించాయి. కానీ ఆ రూమర్లను వారు ఖండిస్తూ.. తాము బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు.
అయితే ఈ లీకైన కంటెస్టెంట్ల లిస్ట్‌లో రోజుకో కొత్త పేరు రావడం, లిస్ట్‌లో పేర్లున్న సెలెబ్రిటీలు ఎక్కడో చోట స్పందిస్తూ రూమర్లను ఖండిస్తున్నారు. మొన్నటికి మొన్న యాంకర్ రవి ఎంట్రీపై లాస్య నోరు జారారు. తాను బిగ్ బాస్ షోలోకి వెళ్లడంపై నెటిజన్లు ఎన్ని రకాలుగా అడిగినా కూడా యాంకర్ రవి క్లియర్ కట్‌గా ఏదీ చెప్పేవారు కాదు. తప్పించుకునే సమాధానాలే చెప్పేవారు.
మొన్న కనబడుట లేదు ఈవెంట్‌లో రవి గురించి లాస్య మాట్లాడుతూ.. ఇంకొన్ని రోజులు అయితే అయితే ఈయన కూడా కనిపించడు.. వేరే హౌస్‌కు వెళ్తున్నారంటూ కామెంట్ చేశారు. దీంతో రవి బిగ్ బాస్ ఎంట్రీపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే నిన్నమొన్నటి వరకు యూట్యూబర్షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ మీద రకరకాల రూమర్లు వచ్చాయి.
No comments:
Post a Comment