ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీనికి కావలసిన
అర్హతలు ,
Age,
Educational Qualifications
Salary
Exam Details
Application Last Date
ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. Contract Basic పై నియామకాలు జరగనున్న ఈ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే..
1. డీఎంహెచ్‌వో(DMHO) - కర్నూలులో 62 మెడికల్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(DMHO).. నేషనల్ హెల్త్ మిషన్(NHM) ద్వారా Contract Basis పైన మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 62
- పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్–01, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్–01, జనరల్ ఫిజిషియన్–01, కార్డియాలజిస్ట్–01, మెడికల్ ఆఫీసర్–28, స్టాఫ్ నర్స్‌లు–22, ల్యాబ్ టెక్నీషియన్–01, ఫిజియోథెరపిస్ట్–01, ఆడియోమెట్రీషియన్–01, సోషల్ వర్కర్–02, కన్సల్టెంట్–01, హాస్పిటల్ అటెండెంట్–01, శానిటరీ అటెండెంట్–01.
- అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డీఎంఎల్/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ(సోషల్ వర్క్), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
- వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
- వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
- ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
- దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ చిరునామకు పంపించాలి.
- దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 15, 2021
No comments:
Post a Comment