Thursday, September 23, 2021

డిగ్రీ, డిప్లొమా పాసైన వారికి 535 ఉద్యోగాలు.. రూ.1,05,000 జీతం.. పూర్తి వివరాలివే

 

IOCL 513 Jobs: ఇందులో జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి.


భారత ప్రభుత్వ రంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఓసీఎల్‌) రిఫైనరీస్‌ విభాగం.. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా
513 పోస్టులను భర్తీ చేయనుంది. 


ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అక్టోబర్‌ 12 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 513
  • పోస్టుల వివరాలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్, జూనియర్‌ మెటీరియల్‌ అసిస్టెంట్, జూనియర్‌ నర్సింగ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టులున్నాయి.
  • విభాగాలు: ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫైర్‌ అండ్‌ సేఫ్టీ.
  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ(నర్సింగ్‌), బీఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
  • వయసు: 30.09.2021 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
  • ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
  • వేతనం: రూ.1,05,000
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తు ఫీజు: రూ.150
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్‌ 21, 2021
  • దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్‌ 12, 2021
  • రాత పరీక్ష తేది: అక్టోబర్‌ 24, 2021
  • వెబ్‌సైట్‌:https://iocl.com/

Tuesday, September 21, 2021

CDAC Hyderabad Jobs | Notification for Project Manager, Project Engineer and Project Associates 38 Vacancies

 

సెంట‌ర్ ఫ‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటింగ్ (C-DAC) హైద‌రాబాద్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా 38 ప్రాజెక్ట్ మేనేజ‌ర్‌, ప్రాజెక్టు ఇంజనీర్‌, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టును భ‌ర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. అర్హత, ఆసక్తి ఉండి ద‌ర‌ఖాస్తు చేయాల‌నుకొనే అభ్య‌ర్థులు పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయాలి.


మొత్తం ఖాళీలు: 38
  • ప్రాజెక్టు
    మేనేజర్- 01
  • ప్రాజెక్టు ఇంజనీర్- 36
  • ప్రాజెక్టు అసోసియేట్- 01
ముఖ్య సమాచారం:
  • అర్హత: సంబంధిత రంగాల్లో బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.
  • దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 17, 2021
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్‌ 5, 2021
  • అధికారిక వెబ్ సైట్:https://www.cdac.in/
  • ఎంపిక విధానం: అభ్య‌ర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మ‌ల్టీ లెవ‌ల్ ఇంట‌ర్వ్యూ విధానం నిర్వ‌హిస్తారు. అవసరం అయితే ఎంపిక ప్ర‌క్రియ మార్చే హ‌క్కు సంస్థ‌కు ఉంటుంది.

ఇలా అప్లయ్ చేసుకోవాలి:
  • ముందుగా పూర్తి వివరాలకు నోటిఫికేషన్‌ చూడాలి.
  • డిస్‌ప్లేలో ప్ర‌తీ పోస్టు వివ‌రాలు ఉంటాయి.
  • ప్ర‌తీ పోస్టు ప‌క్క‌న Details ఆప్ష‌న్ ఉంటుంది.
  • అది క్లిక్ చేసిన అనంత‌రం పోస్టుకు సంబంధించిన వివ‌రాలు వ‌స్తాయి.
  • అర్హ‌త‌లు స‌రిచూసుకొని కింద Apply ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
  • పూర్తి వివరాలను ఎంటర్‌ చేసిన అనంతరం సబ్‌మిట్‌ చేయాలి.

Wednesday, September 15, 2021

AP లో 179 ఉద్యోగాలు.. ఈనెల 15 దరఖాస్తులకు చివరితేది.. వెంటనే అప్లయ్‌ చేసుకోండి

ఈరోజు  ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. దీనికి కావలసిన 

అర్హతలు , 

Age,

Educational Qualifications 

Salary

Exam Details

Application Last Date

ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.



ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. Contract Basic పై నియామకాలు జరగనున్న ఈ పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళ్తే..


1. డీఎంహెచ్‌వో(DMHO) - కర్నూలులో 62 మెడికల్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం(DMHO).. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(NHM) ద్వారా Contract Basis పైన మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 62

  • పోస్టుల వివరాలు: సైకియాట్రిస్ట్‌–01, ఫోరెన్సిక్‌ స్పెషలిస్ట్‌–01, జనరల్‌ ఫిజిషియన్‌–01, కార్డియాలజిస్ట్‌–01, మెడికల్‌ ఆఫీసర్‌–28, స్టాఫ్‌ నర్స్‌లు–22, ల్యాబ్‌ టెక్నీషియన్‌–01, ఫిజియోథెరపిస్ట్‌–01, ఆడియోమెట్రీషియన్‌–01, సోషల్‌ వర్కర్‌–02, కన్సల్టెంట్‌–01, హాస్పిటల్‌ అటెండెంట్‌–01, శానిటరీ అటెండెంట్‌–01.
  • అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌/టీఎంఎల్‌టీ/బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ(సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
  • వయసు: 01.07.2021 నాటికి 42ఏళ్లు మించకుండా ఉండాలి.
  • వేతనం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.1,10,000 వరకు చెల్లిస్తారు.
  • ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌ చిరునామకు పంపించాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్‌ 15, 2021

Tuesday, September 7, 2021

BIGG BOSS TELUGU 1ST WEEK NOMINATIONS LIST

 హీట్ హీట్‌గా సాగిన తొలివారం నామినేషన్స్‌కి శంఖం పూరించారు బిగ్ బాస్. తొలివారం నామినేషన్స్‌లో భాగంగా.. ఇంటి సభ్యుల మధ్య పెంటపెట్టాడు.. అందరి ఫొటోలతో కూడిన చెత్త కవర్లను ఉంచి.. నామినేట్ చేసేవాళ్ల కవర్‌ని తీసుకుని వెళ్లి ఒక్కొక్కరు ఇద్దరిద్దరిద్దు చొప్పున నామినేట్ చేయాలని చెప్పారు. మొదటిగా శ్రీరామ్‌ని నామినేట్ చేయాల్సిందిగా కోరాడు బిగ్ బాస్. ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే..


1. శ్రీరామ్.. మానస్, జెస్సీ‌ లను నామినేట్ చేశాడు.

వీళ్లిద్దర్నీ నామినేట్ చేస్తూ వాళ్లతో పెద్దగా పరిచయం లేకపోవడం వల్ల నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.

2. సరయు.. కాజల్, రవిలను నామినేట్ చేసింది.

కాజల్‌ని నామినేట్ చేస్తూ.. ఆమెకి బిగ్ బాస్ స్ట్రాటజీ బాగా తెలుసు అందుకే నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. ఇక రవిని నామినేట్ చేస్తూ నాకు గట్టి కాంపిటేటర్‌గా భావిస్తున్నా అందుకే నామినేట్ చేశా అని చెప్పింది.

3. శ్వేత.. హమిద, నటరాజ్‌లను నామినేట్ చేసింది.

4. విశ్వ.. జశ్వంత్ (జెస్సీ), మానస్‌లను నామినేట్ చేశాడు.

యాటిట్యూడ్ చూపించొద్దు అంటూ విశ్వ.. జెస్సీకి వార్నింగ్ ఇచ్చాడు. ఉదయం జరిగిన డిస్కషన్‌లో అతని ప్రవర్తన తనకి నచ్చలేదని అందుకే నామినేట్ చేశానని చెప్పాడు. అయితే జెస్సీ.. విశ్వపై ఫైర్ అవుతూ జరిగిన దాన్ని విశ్వ తప్పుగా అర్థం చేసుకున్నాడని బాధపడ్డాడు.

5. ఆనీ మాస్టర్.. సిరి, జెస్సీలను నామినేట్ చేశారు.

6. జెస్సీ .. విశ్వ, హమీదాలను నామినేట్ చేశాడు. నామినేట్ చేస్తూ.. ఆనీ మాస్టర్ తనని నామినేట్ చేసినా కోపం లేదని.. కారణం లేకుండా కోప్పడి గొడవకు కారణం అయిన హమీదాని నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.

7. యాంకర్ రవి.. నటరాజ్, మానస్‌లను నామినేట్ చేశాడు.


నటరాజ్‌ని నామినేట్ చేస్తూ.. మీతో నాకు చాలా ఏళ్లుగా పరిచయం ఉంది కానీ.. మీరు ఇక్కడ నాకు చాలా కొత్తగా కనిపిస్తుంది.. మీ పక్కకు రావాలంటే భయం వేస్తుందని అన్నాడు రవి. అలాగే మానస్ ఎవరితోనూ కలవడం లేదేమో అనిపిస్తుందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు రవి.

8. ఉమాదేవి.. కాజల్, జశ్వంత్‌ని నామినేట్ చేసింది.

కాజల్‌ని నామినేట్ చేస్తూ ఆమె ఆటను చాలా క్యాలిక్యులేట్‌గా ఆడుతుందని.. అది తెలిసిపోతుందని చెప్పింది.

9. హమీదా.. లహరి, జెస్సీలను నామినేట్ చేసింది.

10. షణ్ముక్ జస్వంత్.. సన్నీ, లోబోలను నామినేట్ చేశాడు.

11. సన్నీ.. షణ్ముక్, సరయులను నామినేట్ చేశాడు.

12. ప్రియాంక.. షణ్ముఖ్, హమీదలను నామినేట్ చేసింది.

13. నటరాజ్.. రవి, జెస్సీలను నామినేట్ చేశారు.


రవిని నామినేట్ చూస్తూ.. నేను నాలాగే ఉంటానని నీకోసం నేను నటించలేనని చెప్పాడు నటరాజ్ మాస్టర్. ఇక జెస్సీ‌ని నామినేట్ చేస్తూ.. నువ్ మరీ అమాయకత్వంగా ఉంటున్నావ్.. ఇలా ఉంటే తొక్కేస్తారని అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని అన్నాడు నటరాజ్ మాస్టర్. దీంతో జెస్సీ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.

14. ప్రియ.. సిరి, కాజల్‌‌లను నామినేట్ చేసింది.

15. లోబో.. ప్రియ, యాంకర్ రవిలను నామినేట్ చేశాడు.

ఇతని నామినేషన్ చాలా ఫన్నీగా సాగింది. ఇంటి సభ్యుల్ని అందర్నీ తెగ నవ్వించాడు.

యాటిట్యూడ్ చూపిస్తే నాకు మీటర్ లేచిపోతుందని.. ప్రియ యాటిట్యూడ్ చూపించారని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు. రవి కూడా యాటిడ్యూడ్ చూపించాడని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు.

16. మానస్.. విశ్వ, సరయులను నామినేట్ చేశాడు.

17. సిరి.. హమీదా, ప్రియలను నామినేట్ చేసింది.

18. కాజల్.. సరయు, ఉమలను నామినేట్ చేసింది.

ఆమె నామినేట్ చేస్తూ.. బిగ్ బాస్ నా ఫేవరేట్ షో. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా.. నా డ్రీమ్‌కి అడ్డుకట్టు వేసి నామినేట్ చేసిన సరయు, ఉమలను నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది.

19. లహరి.. హమిదా, కాజల్‌లను నామినేట్ చేసింది.

మొత్తం రంజుగా సాగిన ఈ నామినేషన్ పక్రియలో యాంకర్ రవి, మానస్, సరయు, కాజల్, హమీదా, జస్వంత్ (జెస్సీ)లు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురిలో ఒకరు తొలివారమే ఇంటి ముఖం పట్టబోతున్నారు. ఇవీ నేటి ఎపిసోడ్‌లో అప్డేట్స్..

సన్నీ నామినేట్ చేస్తూ.. షణ్ముక్‌కి కౌంటర్లు వేశాడు.. మనం ఏం చేసినా సైన్యం ఉంటుంది అనుకుంటాం కానీ.. ఇక్కడకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కడికీ సైన్యం వస్తుంది. యుద్దానికి వెళ్లేటప్పుడు ఆవేశం ఎంత ఉండాలో ఆలోచన కూడా అంతే ఉండాలి అంటూ హితోపదేశం చేశాడు.

Wednesday, August 11, 2021

BIGG BOSS 5

  • బిగ్ బాస్ 5 షో జోరు
  • కంటెస్టెంట్ల లిస్ట్ వైరల్
  • రూమర్లపై షణ్ముఖ్ జశ్వంత్

బిగ్ బాస్ షో ఇప్పుడు ఎంతగా హాట్ టాపిక్ మారిందో అందరికీ తెలిసిందే. ఐదో సీజన్‌కు సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించిన లీకులు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. రోజుకో కొత్త పేరు తెర మీదకు వస్తోంది. కంటెస్టెంట్ల లీకుల లిస్ట్ చూస్తే ఈ సారి షో మంచి ఊపు మీదుండేలా కనిపిస్తోంది. కానీ ఆ లిస్ట్‌లోంచి చివరి వరకు ఉండేది ఎవరు? బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టేది ఎవరు? అన్న విషయాలే ఆసక్తికరంగా మారాయి. ఆగస్ట్ మొదటి వారంలో వదిలిన బిగ్ బాస్ ఐదో సీజన్ లోగో అందరినీ ఆకట్టుకుంది.


ఈ సారి షో కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉండబోతోన్నట్టు పరోక్షంగా చెప్పేశారు. యాంకర్ రవి, నవ్యస్వామి, వర్షిణి, సిరి హన్మంత్, లోబో, యూట్యూబర్ సరయు, షణ్ముక్ జశ్వంత్, సీరియల్ హీరో శ్రీహాన్, ఆట సందీప్ భార్య జ్యోతి, సీరియల్ హీరో మానస్, ప్రియాంక రామన్, నటి ప్రియ, ట్రాన్స్ జెండర్ జబర్దస్త్ ఆర్టిస్ట్ సాయి (ప్రియాంక సింగ్), యానీ మాస్టర్, టీవీ 9 ప్రత్యూష ఇలా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. సురేఖా వాణి, ఇషా చావ్లా పేర్లు కూడా వినిపించాయి. కానీ ఆ రూమర్లను వారు ఖండిస్తూ.. తాము బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లడం లేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ లీకైన కంటెస్టెంట్ల లిస్ట్‌లో రోజుకో కొత్త పేరు రావడం, లిస్ట్‌లో పేర్లున్న సెలెబ్రిటీలు ఎక్కడో చోట స్పందిస్తూ రూమర్లను ఖండిస్తున్నారు. మొన్నటికి మొన్న యాంకర్ రవి ఎంట్రీపై లాస్య నోరు జారారు. తాను బిగ్ బాస్ షోలోకి వెళ్లడంపై నెటిజన్లు ఎన్ని రకాలుగా అడిగినా కూడా యాంకర్ రవి క్లియర్ కట్‌గా ఏదీ చెప్పేవారు కాదు. తప్పించుకునే సమాధానాలే చెప్పేవారు.

మొన్న కనబడుట లేదు ఈవెంట్‌లో రవి గురించి లాస్య మాట్లాడుతూ.. ఇంకొన్ని రోజులు అయితే అయితే ఈయన కూడా కనిపించడు.. వేరే హౌస్‌కు వెళ్తున్నారంటూ కామెంట్ చేశారు. దీంతో రవి బిగ్ బాస్ ఎంట్రీపై అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అయితే నిన్నమొన్నటి వరకు యూట్యూబర్
షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ మీద రకరకాల రూమర్లు వచ్చాయి.

కానీ ఇప్పుడు వంద శాతం కన్ఫామ్ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ తాజాగా షణ్ముఖ్ వేసిన ఓ పోస్ట్ చూస్తే అది బిగ్ బాస్ రూమర్ల గురించి స్పందించినట్టు తెలుస్తోంది. నాకు నెగెటివ్ కామెంట్లు, తిట్లు కొత్తేమీ కాదు.. రాసే వాళ్లను రాయనివ్వండి..నేను చెప్పే వరకు వేటినీ నమ్మకండి అని షణ్ముఖ్ పోస్ట్ వేశారు.

Saturday, August 7, 2021

Maa Elections : ఒక్క రూపాయి సంపాదించలేదు.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.. నరేష్‌పై హేమ సంచలన కామెంట్స్

 

మా సభ్యులందరికీ హేమ వాయిస్ మెసెజ్‌లు పంపుతున్నారట. అందరి అభిప్రాయాన్ని సేకరించి.. మా ఎన్నికలపై పెద్దలకు లేఖలు రాసేందుకు రెడీ అయ్యారట. ఎన్నికలు వెంటనే జరపాలంటూ కోరుతున్నారట.

 
ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.. నరేష్‌పై హేమ సంచలన కామెంట్స్

ప్రధానాంశాలు:

  • మరో మలుపు తిరిగిన మా
  • నరేష్‌పై హేమ కామెంట్స్
  • డబ్బుల వ్యవహారంపై రచ్చ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఆరోపణలు, విమర్శలు, ఒకరిపై మరొకరు దూషణలతో మా బృందం మీడియాకెక్కింది. ఇది చాలాదన్నట్టు ట్విట్టర్ వేదికగానూ ఆరోపణలు చేసుకుంటారు. ఒకరిపై ఒకరు పరోక్షంగా కత్తులు దూసుకుంటున్నారు. అసలైతే ఈ సారి ఐదుగురు పోటీలో ఉన్నా కూడా మంచు విష్ణుప్రకాశ్ రాజ్ మధ్యే అధ్యక్ష పదవి కుర్చీ ఉందని టాక్ వచ్చింది.కానీ దాని కోసం హేమ, జీవిత, నటుడు సీవీఎల్ నరసింహారావు వంటి వారు కూడా పోటీ పడుతున్నారు. కానీ వీరి పేర్లు ఎక్కడా కూడా అంతగా వినిపించడం లేదు. కానీ సడెన్‌గా హేమ తన స్టైల్లో పావులు కదుతుపున్నట్టు కనిపిస్తోంది.

మా సభ్యులందరికీ హేమ వాయిస్ మెసెజ్‌లు పంపుతున్నారట. అందరి అభిప్రాయాన్ని సేకరించి.. మా ఎన్నికలపై పెద్దలకు లేఖలు రాసేందుకు రెడీ అయ్యారట. ఎన్నికలు వెంటనే జరపాలంటూ కోరుతున్నారట. ఆ వాయిస్ ఓవర్‌లో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మీద సంచలన కామెంట్స్ చేశారు. ఇంత వరకు రూపాయి కూడా సంపాదించి పెట్టలేదని ఉన్నదంతా ఊడ్చేస్తున్నారన్నట్టుగా ఆరోపించారు. ఇంతకీ ఆ వాయిస్ ఓవర్‌లో ఉన్నదేంటంటే..

‘హాయ్ అండి.. ఈ మెసేజ్ నేను ఒక్కక్కరికీ కాకుండా కామన్‌గా చెప్పేస్తున్నాను. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను. ఏం లేదు ‘మా’ ఎలక్షన్స్ పెట్టకూడదు. నరేష్‌గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతలివారు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు.

పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇదివరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు... ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు.


కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి అని ఈ లెటర్. నేను మనిషిని పంపిస్తాను.. మీరు సంతకం చేసి పంపిస్తే.. నేను ‘మా’ అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. ఆ లెటర్‌లో ఉన్న మ్యాటర్, నేను చెప్పే మ్యాటర్ ఒకటే. ప్లీజ్ అందరూ ఎలక్షన్ కావాలని మాత్రం చెప్పండి. ఈ సంవత్సరం మెడికల్ క్లైమ్.. అవి, ఇవీ కట్టేస్తే.. నెక్ట్స్ సంవత్సరం పెన్షన్లు ఇచ్చుకోవడానికి మన దగ్గర డబ్బులుండవ్. జీరో అకౌంట్ అయిపోతుంది. రూ. 5 కోట్ల నుంచి జీరో అకౌంట్‌కి.. ఫ్యూచర్‌లో జరుగుతుంది. ఫ్యూచర్ అంటే ఓ నాలుగైదు సంవత్సరాలేం కాదు.. ఒక సంవత్సరంలో అయిపోతుంది. సో.. ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అంటే.. మీరు ఎక్కడుంటే అక్కడికి మనిషిని పంపిస్తా. ఇది కామన్ మెసేజ్. ఇక్కడి నుంచి అందరికీ నేను ఫార్వర్డ్ చేసేస్తా.. ఓకే’ అంటూ హేమ వాయిస్ వినిపిస్తోంది.

దీనిపై ఓ మీడియా సంస్థ హేమ నుంచి వివరణ తీసుకున్నారు. అందులో హేమ మాట్లాడుతూ.. వెంటనే ‘మా’ ఎన్నికలు జరగాలి. కొత్త కమిటీ ఏర్పడాలి. నరేష్ ఇప్పటి వరకు ‘మా’ కోసం సంపాదించింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తామెంతో ఎంతో కష్టపడి ఫండింగ్ చేసిన అమౌంట్‌ని ప్రస్తుత కమిటీ ఖర్చు పెడుతున్న తీరు బాధ కలిగించిందని అన్నారు. ఇదేదో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణుల కోసం ప్రచారానికి చేస్తుంది కాదని హేమ పేర్కొన్నారు.

Sunday, June 13, 2021

images





 


Friday, January 8, 2021

jayam ravi bhoomi in meghastar chiranjeevi monark poster. fan edited


 
jayam ravi bhoomi in meghastar chiranjeevi monark poster. fan edited