Saturday, August 7, 2021

Maa Elections : ఒక్క రూపాయి సంపాదించలేదు.. ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.. నరేష్‌పై హేమ సంచలన కామెంట్స్

 

మా సభ్యులందరికీ హేమ వాయిస్ మెసెజ్‌లు పంపుతున్నారట. అందరి అభిప్రాయాన్ని సేకరించి.. మా ఎన్నికలపై పెద్దలకు లేఖలు రాసేందుకు రెడీ అయ్యారట. ఎన్నికలు వెంటనే జరపాలంటూ కోరుతున్నారట.

 
ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు.. నరేష్‌పై హేమ సంచలన కామెంట్స్

ప్రధానాంశాలు:

  • మరో మలుపు తిరిగిన మా
  • నరేష్‌పై హేమ కామెంట్స్
  • డబ్బుల వ్యవహారంపై రచ్చ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఆరోపణలు, విమర్శలు, ఒకరిపై మరొకరు దూషణలతో మా బృందం మీడియాకెక్కింది. ఇది చాలాదన్నట్టు ట్విట్టర్ వేదికగానూ ఆరోపణలు చేసుకుంటారు. ఒకరిపై ఒకరు పరోక్షంగా కత్తులు దూసుకుంటున్నారు. అసలైతే ఈ సారి ఐదుగురు పోటీలో ఉన్నా కూడా మంచు విష్ణుప్రకాశ్ రాజ్ మధ్యే అధ్యక్ష పదవి కుర్చీ ఉందని టాక్ వచ్చింది.కానీ దాని కోసం హేమ, జీవిత, నటుడు సీవీఎల్ నరసింహారావు వంటి వారు కూడా పోటీ పడుతున్నారు. కానీ వీరి పేర్లు ఎక్కడా కూడా అంతగా వినిపించడం లేదు. కానీ సడెన్‌గా హేమ తన స్టైల్లో పావులు కదుతుపున్నట్టు కనిపిస్తోంది.

మా సభ్యులందరికీ హేమ వాయిస్ మెసెజ్‌లు పంపుతున్నారట. అందరి అభిప్రాయాన్ని సేకరించి.. మా ఎన్నికలపై పెద్దలకు లేఖలు రాసేందుకు రెడీ అయ్యారట. ఎన్నికలు వెంటనే జరపాలంటూ కోరుతున్నారట. ఆ వాయిస్ ఓవర్‌లో ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మీద సంచలన కామెంట్స్ చేశారు. ఇంత వరకు రూపాయి కూడా సంపాదించి పెట్టలేదని ఉన్నదంతా ఊడ్చేస్తున్నారన్నట్టుగా ఆరోపించారు. ఇంతకీ ఆ వాయిస్ ఓవర్‌లో ఉన్నదేంటంటే..

‘హాయ్ అండి.. ఈ మెసేజ్ నేను ఒక్కక్కరికీ కాకుండా కామన్‌గా చెప్పేస్తున్నాను. 200 నుంచి 250 మందికి లెటర్ పంపిస్తున్నాను. ఏం లేదు ‘మా’ ఎలక్షన్స్ పెట్టకూడదు. నరేష్‌గారే ప్రెసిడెంట్‌గా కొనసాగాలని అవతలివారు చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు ‘మా’ అసోషియేషన్ ఒక్క రూపాయి సంపాదించింది లేదు కానీ.. నరేష్ గారు మొత్తం ఉన్న రూ. 5కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టేశారు.

పోయినసారి మెడికల్ క్లైమ్‌కి, రాబోయే మెడికల్ క్లైమ్‌కి కలిపి మొత్తం రెండున్నర కోట్లకు పైగా ఖర్చు అయినట్లు లెక్క. ఆఫీస్ ఖర్చులు అవీ, ఇవీ కలిపి దాదాపు అంతే అవుతుంది. ఇదివరకు ఏంటంటే.. ఆఫీస్ ఖర్చులు బయటి నుంచి తీసుకువచ్చి, మేము ఫండ్ రేజ్ చేసి ఇచ్చే వాళ్లం. ఇప్పుడాయన హాయిగా కూర్చుని మన అకౌంట్‌లో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నారు. ఇప్పుడాయన ఆ కుర్చీ దిగకూడదు... ఎలక్షన్స్ జరగకూడదు అని ప్లాన్స్ వేస్తున్నారు.


కాబట్టి మనమందరం ఎలక్షన్స్ కావాలి అని ఈ లెటర్. నేను మనిషిని పంపిస్తాను.. మీరు సంతకం చేసి పంపిస్తే.. నేను ‘మా’ అసోసియేషన్‌కి సబ్మిట్ చేస్తా. ఆ లెటర్‌లో ఉన్న మ్యాటర్, నేను చెప్పే మ్యాటర్ ఒకటే. ప్లీజ్ అందరూ ఎలక్షన్ కావాలని మాత్రం చెప్పండి. ఈ సంవత్సరం మెడికల్ క్లైమ్.. అవి, ఇవీ కట్టేస్తే.. నెక్ట్స్ సంవత్సరం పెన్షన్లు ఇచ్చుకోవడానికి మన దగ్గర డబ్బులుండవ్. జీరో అకౌంట్ అయిపోతుంది. రూ. 5 కోట్ల నుంచి జీరో అకౌంట్‌కి.. ఫ్యూచర్‌లో జరుగుతుంది. ఫ్యూచర్ అంటే ఓ నాలుగైదు సంవత్సరాలేం కాదు.. ఒక సంవత్సరంలో అయిపోతుంది. సో.. ఈ లెటర్ చదివిన తర్వాత మీరు ఓకే అంటే.. మీరు ఎక్కడుంటే అక్కడికి మనిషిని పంపిస్తా. ఇది కామన్ మెసేజ్. ఇక్కడి నుంచి అందరికీ నేను ఫార్వర్డ్ చేసేస్తా.. ఓకే’ అంటూ హేమ వాయిస్ వినిపిస్తోంది.

దీనిపై ఓ మీడియా సంస్థ హేమ నుంచి వివరణ తీసుకున్నారు. అందులో హేమ మాట్లాడుతూ.. వెంటనే ‘మా’ ఎన్నికలు జరగాలి. కొత్త కమిటీ ఏర్పడాలి. నరేష్ ఇప్పటి వరకు ‘మా’ కోసం సంపాదించింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తామెంతో ఎంతో కష్టపడి ఫండింగ్ చేసిన అమౌంట్‌ని ప్రస్తుత కమిటీ ఖర్చు పెడుతున్న తీరు బాధ కలిగించిందని అన్నారు. ఇదేదో ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణుల కోసం ప్రచారానికి చేస్తుంది కాదని హేమ పేర్కొన్నారు.